హోలీ తేదీపై అయోమయం.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్

అయితే ఈ ఏడాది హోలీ జరుపుకోవాల్సిన తేదీ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలీ పండుగ..

Update: 2023-03-07 06:42 GMT

holi memes

హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశమంతా రంగులమయం అవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ.. రంగులు చల్లుకుంటూ.. రంగు నీటిలో తడుస్తూ.. తీన్ మార్ డప్పులకు స్టెప్పులేస్తూ.. హోలీ సంబరాల్లో మునిగి తేలుతారు. అయితే ఈ ఏడాది హోలీ జరుపుకోవాల్సిన తేదీ విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకోవాలి. ఈసారి రెండురోజులు పౌర్ణమి తిథి వచ్చింది. కొందరు మార్చి 7న హోలీ జరుపుకోవాలని చెప్తుంటే.. మరికొందరు 8నే హోలీ అని పేర్కొంటున్నారు. ఫలితంగా అసలు దేశమంతా ఒకేసారి హోలీ ఎప్పుడు జరుపుకోవాలో తెలియని పరిస్థితి.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ‘భద్రకాల’ సూర్యాస్తమయం సమయంతో సమానంగా ఉంటుంది. దీంతో కొంతమంది మార్చి 6న హోలీకా దహనం చేసి, మార్చి7న హోలీ పండుగను జరుపుకుంటున్నారు. మరికొందరు మార్చి 7న హోలికా దహనంలో పాల్గొని, 8వ తేదీన హోలీ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో హోలీ తేదీపై కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మార్చి 7న హోలీ అని ఒకరంటే.. కాదు 8న అని మరొకరు అంటున్న మీమ్ లు వైరల్ అవుతున్నాయి.



Tags:    

Similar News