Holi 2023 : హోలీ రంగులతో జాగ్రత్త.. ఆ రోజున ఈ జాగ్రత్తలు పాటించండి

సహజమైన రంగులైతే.. చర్మంపై పూసాక శుభ్రం చేసుకోవడం తేలిక. అవే రసాయనాలతో తయారు చేసినవే అయితే.. ఆరోగ్యంపై ప్రభావం..

Update: 2023-03-02 22:30 GMT

holi precautions

హోలీ. ప్రతి ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో (తెలుగు నెలల ప్రకారం ఫాల్గుణ పూర్ణిమ) వచ్చే పండుగ. హోలికా అనే రాక్షసి చనిపోయిన రోజున భారత్ లో రకరకాల రంగులను చల్లుకుంటూ.. ఈ పండుగను చేసుకుంటారు. అయితే.. హోలీ రోజున సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులు కాకుండా.. రసాయనాలతో చేసిన రంగులను ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా.. శ్వాసకోశ, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చర్మ సంబంధిత వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్షణిక ఆనందం కోసం.. శాశ్వత దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదు. అందుకే సహజసిద్ధ రంగులనే వాడాలన్నది నిపుణుల సూచన.

సహజమైన రంగులైతే.. చర్మంపై పూసాక శుభ్రం చేసుకోవడం తేలిక. అవే రసాయనాలతో తయారు చేసినవే అయితే.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రసాయన రంగుల్లో లెడ్ ఆక్సైడ్ ఉంటే మూత్రపిండాలకు చేటు. వాటి వలన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆస్తమా, ఇతర శ్వాసకోస వ్యాధులకు గురిచేస్తాయి. హోలీ పూర్తవ్వగానే సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలని సూచిస్తున్నారు చర్మ వైద్యులు. అలాగే హోలీ ఆడే ముందు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయకపోవడం మంచిది. దానికి బదులుగా చర్మానికి కొబ్బరినూనెను లోషన్ లా రాసుకుంటే.. చర్మంపై పడిన రంగులు త్వరగా శుభ్రమవుతాయి. ఆడవాళ్లు.. గోళ్లకు నెయిల్‌ వార్నిష్‌ వాడితే మంచింది.
ఈ రంగుల పండుగ చేసుకునేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వారి కళ్లలో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లను రక్షించేందుకు తాత్కాలిక కళ్లజోళ్లను వాడటం చెప్పదగిన సూచన.


Tags:    

Similar News