KTR : ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నకేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఉదయం నందినగర్ నివాసంలో పార్టీ నేతలు, న్యాయనిపుణులతో సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎన్ని కేసులు పెట్టినా...
నందినగర్ నివాసం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ తనపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తన తమ్ముళ్లకు, బావమరదులుకు ఎలాంటి కాంట్రాక్టులు తాను ఇవ్వలేదన్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే తాను ప్రయత్నించానని ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. అరపైసా అవినీతి కూడా తాను చేయలేదని, అయినా ఎన్నికేసులు పెట్టినా తాను భయపడే ప్రశ్న లేదని కేటీఆర్ ఏసీబీ విచారణకు బయలుదేరే ముందు వ్యాఖ్యానించారు.