సన్ రైజర్స్ టీం బస చేసిన హోటల్ లో అగ్ని ప్రమాదం
సన్ రైజర్ హైదరాబాద్ టీం బస చేసిన పార్క్ హయత్ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది;

సన్ రైజర్ హైదరాబాద్ టీం బస చేసిన పార్క్ హయత్ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 2 లో ఉన్న పార్క్ హయత్ హోటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులు మంటలు చెలరేగాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మాత్రం ఆరో అంతస్థులో ఉంది. అయతే వెంటనే హోటల్ యాజమాన్యం అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
మొదటి అంతస్తులో మంటలు...
మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో హోటల్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. భారీగా పొగలు ఎగిసిపడుతుండటంతో కొందరు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే ఎవరికీ ఈ ప్రమాదంలో గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా గుర్తించారు.