Hydra : మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు నేడు ప్రారంభం
హైదరాబాద్‌లోని మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలను ఈరోజు ఉదయం ప్రారంభించింది.;
హైదరాబాద్‌లోని మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలను ఈరోజు ఉదయం ప్రారంభించింది. మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కావూరి హిల్స్ పార్కు ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసిన వైనంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యదు చేసింది. దీంతో ఈరోజు ఉదయం స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు.
మరికొన్ని నిర్మాణాలను...
దీంతో పాటు మరికొన్ని నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. తమకు అందిన ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించి అక్రమ నిర్మాణాలని నిర్ధారించుకున్న తర్వాత అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.