Allu Arjun : కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఉన్నారు. ఇద్దరూ కలసి కిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రితో అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పోలీసుల భారీ బందోబస్తు...
అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ ఆసుపత్రి ప్రాంగణంలోకి రానివ్వకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ వాహనాన్నిమాత్రమే లోపలికి అనుమతించారు. పోలీసుల అనుమతి తీసుకునే అల్లు అర్జున్ ను నేడు శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now