చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. ఏసీపీతో పాటు డీసీపీ కూడా కలసి అల్లు అర్జున్ ను విచారించే అవకాశముంది. విచారణ దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు సాగనుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విచారణలో సంథ్యా థియేటర్ లో జరిగిన ఘటనపై పోలీసులు ఏం జరిగిందన్న దానిపై విచారణ చేయనున్నారు. దాదాపు పదికి పైగా ప్రశ్నలు పోలీసు అధికారులు అల్లు అర్జున్ విచారణ కోసం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని వీడియో రికార్డు చేయడమే కాకుండా, లిఖితపూర్వకంగా కూడా ఆయన నుంచి ప్రశ్నలకు సమాధానం తీసుకునే అవకాశాలున్నాయి.
థియేటర్ వద్ద జరిగిన...
సంథ్య థియేటర్ కు మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చే ముందు బౌన్సర్లు తోపులాట జరుగుతుందని చెప్పారా? మీరు థియేటర్ కు వెళ్లే సమయంలో ఉన్న క్రౌడ్ ను చూసి మీరు అభివాదం చేసుకుంటూ ఎందుకు వెళ్లారు. బౌన్సర్లు గేట్లు తీయడం, వేయడం వంటి వాటిని చూసి మీరు పరిస్థితిని అంచనా వేసుకున్నారా? థియేటర్ లోకి వెళ్లిన తర్వాత పోలీసు అధికారులు వచ్చి థియేటర్ బయట జరిగిన ఘటనను గురించి చెప్పారా? లేదా? మిమ్మల్ని థియేటర్ నుంచి వెళ్లిపొమ్మన్నారా? లేదా? మీరు థియేటర్ కు ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు తిరిగి వెళ్లారు? అన్న దానిపై కూడా పోలీసులు ఈ విచారణలో ప్రశ్నించే అవకాశాలున్నాయి.
అల్లు అర్జున్ తో పాటు...
దీంతో పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ చేసిన తర్వాత సీన్ రీకనస్ట్రక్సన్ కోసం సంథ్యా ధియేటర్ వద్దకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్ తో పాటు ఆయన న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ను పోలీసులు ఇంటికి వెళ్లి భారీ బందోబస్తు మధ్యపోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్ ను విచారించేందుకు పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. సంథ్యా థియేటర్ వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now