Allu Arjun: నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రానున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు;

Update: 2025-01-05 03:19 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రానున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు బాలుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.


నేడు ఆదివారం కావడంతో...

ఈ ఘటనలో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. అయితే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. ఈ షరతు నేటి నుంచి అమలులోకి వస్తుండటంతో నేడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News