Allu Arjun : మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

ఈరోజు నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది.;

Update: 2025-01-04 08:20 GMT


 



ఈరోజు నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టులో పూచికూత్తును సమర్పించేందుకు నాంపల్లి కోర్టుకు రానున్నారు. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించాలని నిన్న నాంపల్లి కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో వాటిని సమర్పించేందుకు అల్లు అర్జున్ వస్తున్నారు.

పూచీకత్తు సమర్పించేందుకు ....

సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తూ నాంపల్లి కోర్టు షరతులు విధించింది. రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు ప్రతి ఆదివారం హాజరు కావాలని కూడా షరతు విధించింది. ప్రస్తుతం సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈరోజు నాంపల్లి కోర్టుకు వచ్చి మెజిస్ట్రేట్ ఎదుట సంతకాలు చేయనున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News