కాలుష్యంపై పోరాట ర్యాలీలతో దద్దర్రిల్లిన బాచుపల్లి

పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో హైదరాబాద్ లోని బొల్లారం కాజిపల్లి బొంతపల్లి పాస మైలారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు;

Update: 2025-04-13 12:35 GMT
bollaram, pollution, industries. hyderabad
  • whatsapp icon

పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో హైదరాబాద్ లోని బొల్లారం కాజిపల్లి బొంతపల్లి పాస మైలారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా వారు కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాతంలోని పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి రసాయనిక పరిశ్రమల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదజల్లుతున్నట్లు అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం వల్ల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు దుండిగల్ మున్సిపాలిటీ బొల్లారం మున్సిపాలిటీ లలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు రోజురోజుకీ తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నందున కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది మార్చి 9వ తేదీనన ర్యాలీలు నిర్వహించారు. తర్వాత మార్చి 15వ తారీఖున పీసీబీ అధికారులకు ప్రజల సంతకాలతో వినతి పత్రం సమర్పించారు. దానికి పిసిబి అధికారులు ఇచ్చినటువంటి ఈ క్రింది వాగ్దానాలను నెరవేర్చటంలో విఫలమైనందున దానికి నిరసనగా ఈరోజు బాచుపల్లి మల్లంపేట్ బొల్లారం కూడలిలో నిరసన తెలియజేశారు. రెండు నెలలు కావస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.



 


హామీలు ఇవీ...
24x7 పెట్రోలింగ్ ద్వారా గస్తీ నిర్వహిస్తామని బాధ్యులను పట్టుకొని శిక్షిస్తామని చేయలేదన్నారు.
తనిఖీ లో దొరికిన పరిశ్రమల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా చేయలేదు.
నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీల జాబితాను విడుదల చేస్తామని చెప్పి పట్టించుకోలేదు
వాటిని తరలించడానికి చర్యలు చేపడతామని వాగ్దానం చేసినా అమలు చేయలేదు.


 


నిరసన తెలియజేసి...
ఇప్పటికైనా అధికారులు తమకు ఇచ్చిన వాగ్దానాల అమలుపరచాలని లేనియెడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన హరితహారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బీజేపీ మల్కాజ్గిరి కౌన్సిల్ సభ్యులు వెంకట సుబ్బారావు అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రణీత్ లీఫ్, ప్రణీత్ జేమ్స్, భావన జీఎల్సీ, క్రాంతి నగర్ కాలనీ, హరితవనం కాలనీ, కె ఆర్ సి ఆర్ కాలనీ శ్రీహమ్స్ కాలనీ , రేణుక ఎల్లమ్మ కాలనీ నందనవనం కాలనీ, ప్రనీత్ జనిత్, ప్రణీత్ ప్రణవ్ యాంటీలియా, ప్రణీత్ ఎంక్లేవ్, ప్రణీత్ టౌన్ స్క్వేర్, బ్లాక్ డైమండ్ కాలనీ మొ,, కాలనీలో నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
























Tags:    

Similar News