భారీగా తగ్గిపోయిన టమాటా ధరలు
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొన్ని నెలలుగా
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొన్ని నెలలుగా రైతులను కోటీశ్వరులుగా చేసిన టమాటా.. ఒకానొక దశలో కిలో 200 దాటేశాయి. అయితే వర్షాలు తగ్గడం.. పంట చేతికి వస్తూ ఉండడంతో మార్కెట్ లో టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కిలో టమాటా 100 కు తక్కువే ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50 రూపాయలకు కూడా కిలో టమాటా అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్‌లో సోమవారం మార్కెట్ లకు 2,450 క్వింటాళ్లు పైనే వచ్చాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరానికి పరిసర జిల్లాల నుంచి టమాటా పెద్ద ఎత్తున వస్తోంది. ప్రస్తుతం రైతు బజార్‌లో కిలో టమాటా ధర రూ. 63 ఉండగా బయట మార్కెట్‌లో రూ. 120 వరకు ఉంది. ఆగస్టు చివరి నాటికి రూ.50 దిగువకు టమాటాలు అందుబాటు ధరలలో వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
కొత్త పంట మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. పూర్తి స్థాయిలో కొత్త పంట దిగుబడి వచ్చేస్తే టమాట ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా టమాట ధరలు భారీగా దిగొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో టమాట ధరలు రూ.250 కి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూపీలోని పలు ప్రాంతాల్లో కిలో టమాట రూ.100 కి చేరుకుంది.