తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు.

Update: 2023-08-15 04:45 GMT

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. హైద్రాబాద్ ప్రగతి భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జండాను ఎగరవేసిన సీఎం కేసీఆర్.. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంత‌రం మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుక‌ల‌లో సీఎంవో అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంత‌రం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు.


ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.


మంగ‌ళ‌గిరి జనసేన కార్యాల‌యంలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లలో పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.



Tags:    

Similar News