వైరస్ లకు చైనా పుట్టిల్లుగా మారింది. గతంలోనూ కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. తాజాగా చైనాలో మరొక వైరస్ విజృంభించిందన్న వార్తలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. వణుకుతెప్పిస్తున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ తో చైనాలో ఆసుపత్రులన్నీ నిండిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కానీ చైనా మాత్రం నింపాదిగా అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నా చైనా ఎప్పుడూ నిజం చెప్పదన్నది వాస్తవం. గతంలో కరోనా వైరస్ సమయంలోనూ చైనా ఇలాగే స్పందించింది. ఏమీ లేదనిచెబుతూనే ప్రపంచం మొత్తం వైరస్ విస్తరించడానికి కారణమైంది.
నాలుగు వైరస్ లు...
ఇప్పడు చైనాలో నాలుగు వైరస్ లు విపరీతంగా సోకుతున్నాయని చెబుతున్నారు. కరోనా వైరస్ తరహాలోనే జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించి చివరకు శ్వాస ఆడక మరణిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించారని కూడా కథకనాలు కనిపిస్తున్నాయి. మాస్క్ లు, శానిటైజర్ల వాడకాన్ని కంపల్సరీ చేశారంటున్నారు. ఆసుపత్రులన్నీ నిండిపోవడంతో ప్రజలు ఇంటి వద్దనే ఉండి వైద్యం తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదని చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి ఐసొలేషన్ ను తరలిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యాక్సిన్ లేకపోవడంతో...
ప్రస్తుతం చైనాలో ఉన్న హెచ్ఎంపీవీ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో వాడిన మందులే వాడాలని అంటున్నారు.అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ప్రపంచం మొత్తం అప్రమత్తమయింది. భారత్ లో కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఎయిర్ పోర్టుల నుంచి వచ్చే వారికి పరీక్షలు జరపాలని, లేకుంటే మనదేశానికి కూడా ఈ వైరస్ త్వరలోనే వచ్చే అవకాశముందని అంటున్నారు. దీంతో భారత్ ప్రభుత్వం అలెర్ట్ అయి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలను జారీ చేసింది. జపాన్,హాంకాంగ్ కు కూడా ఈ వైరస్ విస్తరించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now