నేడు పగలు ఎనిమిది గంటలే..రాత్రి మాత్రం పదహారు గంటలు
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. పగలు తక్కువ. రాత్రి ఎక్కువగా ఉండే రోజు ఇది
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. పగలు తక్కువ. రాత్రి ఎక్కువగా ఉండే రోజు ఇది. పగలు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది. రాత్రి పదహారు గంటల పాటు ఉంటుంది. అంటే ఎక్కువ సమయం నిద్రించే రోజు ఇది. ఈ నెల 21వ తేదీన పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత అరుదుగా జరిగే విషయం. ఎందుకంటే సాధారణంగా శీతాలకంలో పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం, అలాగే పగలు తక్కువగా ఉండటం, రాత్రివేళ ఎక్కువగా ఉండంటం జరుగుతుంది. దీనిని అయనాంతంగా పిలుస్తారు. కానీ ఈరోజు మాత్రం పగలు అతి తక్కువగా, రాత్రి సుదీర్ఘంగా ఉండటం మాత్రం అరుదనే ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతన్నారు.
శీతాకాలపు అయనాంతం...
శీతాకాలపు అయనాంతం ఏర్పడే కాలంలో సూర్యుడి నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుందని, అదే సమయంలో చంద్రక్రాంతి భూమిపై ఎక్కువ సేపు ఉంటుందని చెబుతున్నారు. ఇది మామూలుగా జరిగే మార్పు అయినప్పటికీ అసాధరణ విషయంగానే చూడాలి. ఈరోజు భూమికి, సూర్యుడికిమధ్య దూరం ఉండటంతో పాటు సూర్యకిరణాలు కూడా ఆలస్యంగా భూమిని చేరతాయి. అయితే ఈ పరిణామాలను ఒక్కో దేశంలో ఒక్కోరకంగా భావిస్తారు. తూర్పు ఆసియాదేశాల్లో శుభసూచకంగా భావిస్తారు. అదే సమయంలో ఉత్తరభారతదేశంలో మాత్రం శ్రీకృష్ణుడిని కొలుస్తారు. గీతాపారాయణం చేస్తారు. మొత్తం మీద మన దేశంలోనే కాదు అన్నిదేశాల్లోనూ ఏదోరకమైన భావనతో నేడు ఉన్నప్పటికీ శాస్రీయంగా మాత్రం శీతాకాలపు అయనాంతంగానే ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో పెద్దగా ప్రత్యేకత అంటూ ఏమీ లేదంటున్నారు.