మళ్లీ వైరస్ మహమ్మారి...మాస్కులు తప్పవా? శానిటైజర్లు వాడాల్సిందేనా?

చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది;

Update: 2025-01-03 04:06 GMT

చైనాలో మరో వైరస్ కలకలం రేపుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. పెద్దయెత్తున ప్రజలు చైనాలో ఆసుపత్రిలో చేరుతున్నారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని తేలింది. అయితే మరోసారి ప్రపంచాన్ని చైనా వణికించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోనే మరొక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో కలకలం రేగుతుంది. ఊపిరి ఆడకుండా అనేక మంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది.

సోషల్ డిస్టెన్స్ ను కూడా...
చైనాలో మాస్క్ లను కంపల్సరీ చేసింది. అదే సమయంలో సోషల్ డిస్టెన్స్ ను కూడా మెయిన్ టెయిన్ చేయాలని సూచించింది. అత్యంత వేగంగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. చైనాలో మరోసారి కోవిడ్ 19 వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ అలెర్ట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమెర్జెన్సీని ఇప్పటికే ప్రకటించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాడు కరోనా వైరస్ కూడా చైనాలో స్టార్టయి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. కోట్లాది మందికి వైరస్ సోకింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది. మరోసారి వైరస్ కలకలం రేగడంతో ఈ ఏడాది తొలి వారంలోనే ఈ వార్త విశ్వవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది.

ఆంక్షలు అమలు చేసే దిశగా...
ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో కొన్ని ఆంక్షలు అమలులోకి తెచ్చే అవకాశముందని చెబుతున్నారు. మాస్క్ లు తప్పనిసరిగా వాడటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి పనులతో వైరస్ కు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగించినట్లు సమాచారం అందుతుంది. చైనాలో కొత్త వైరస్ ఏర్పాటు చేయడంతో ఆ దేశం నుంచి వచ్చే వారిని ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు జరిపి అవసరమైతే ఐసొలేషన్ కు తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఐదేళ్ల క్రితం ఒక ఊపు ఊపిన కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోసారి హెచ్ఎంపీవీ వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ భయభ్రాంతులకు గురవుతున్నాయి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News