థర్డ్ వేవ్ అట.. ఊపేస్తుంది.. రోజుకు రెండు లక్షల కేసులు

కరోనా థర్డ్ వేవ్ ఫ్రాన్స్ ను ఊపేస్తుంది. రోజుకు రెండు లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి;

Update: 2022-01-02 02:34 GMT

కరోనా థర్డ్ వేవ్ ఫ్రాన్స్ లో ప్రారంభమయిందనే చెప్పాలి. థర్డ్ వేవ్ ఫ్రాన్స్ ను ఊపేస్తుంది. రోజుకు రెండు లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటు కరోనా తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినా ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఫ్రాన్ ను వణికిస్తుంది.

ఒక్కరోజే....
ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజే 2,19,126 కేసులు నమోదయ్యాయి. 110 మంది కరోనాతో మరణించారు. దీంతో ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ 75 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగినప్పటికీ కరోనా సోకడం మాత్రం ఆగడం లేదు.


Tags:    

Similar News