ఇటలీలో వింత ఆచారం
ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో అలివి కాని హామీలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కబోనులో బంధించి నీటిలో ముంచుతారు;
మనదేశంలో హామీలు మరిచిన నేతలకు ఎలాంటి శిక్ష ఉండదు. మహా అయితే తర్వాత ఎన్నికల్లో ఓట్లు వేయకుండా పక్కన పెడతారు. తిరస్కరిస్తారు. ఓటమే వారికి శిక్ష. కానీ ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో అలా కాదు. అలివి కాని హామీలిచ్చి అమలు చేయని రాజకీయ నేతలను చెక్కబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. తమ తప్పును సరిదద్దిుకునేందుకే రాజకీయ నేతలకు ఇలాంటి శిక్షను గ్రామస్థులు వేయడం ఆనవాయితీగా వస్తుంది.
తప్పు చేసిన నేతలను...
అయితే ఇందుకోసం ప్రత్యేక సమయం ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ లో టోంకా పేరుతో వేడుకలను నిర్వహించి మరీ హామీలు అమలు చేయని నేతలకు శిక్షను అమలు చేస్తారు. తాము ఎన్నకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించడాన్ని వారు గుర్తు చేస్తారు. తమ సమస్యలను పరిష్కరించగలిగే వారినే ఎన్నుకుంటారు. చెక్క బోనులో హామీలను అమలు పర్చని నేతలను బంధించి క్రేన్ సహాయంతో నదిలో ముంచుతారు. కొద్దిసేపే ముంచినా వారికి బుద్ధి వస్తుందని ట్రెంట్ పట్టణ వాసులు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు. మనదేశంలోనూ ఇలాంటి పద్ధతి ఉంటే బాగుండేమో కదా?