విమానంలో మంటలు : అత్యవసర ల్యాండింగ్
విమానంలో మంటలు ఒక్కసారిగా రావడంతో ఖాట్మండులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. నేపాల్లో ఈ విమాన ప్రమాదం జరిగింది;
విమానంలో మంటలు ఒక్కసారిగా రావడంతో ఖాట్మండులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. నేపాల్లో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండు నుంచి దుబాయ్ కు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఖాట్మండు ఎయిర్ పోర్టులో అత్య వసర ల్యాండింగ్ చేశారు.
150 మంది ప్రయాణికులతో...
దీంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అనంతరం కొద్ది సేపటికే విమానం దుబాయ్కు టేకాఫ్ అయింది. ప్రమాద సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సాహసోపేతంగా ల్యాండింగ్ చేయడం వల్లనే తాము బతికిపోయామని ప్రయాణికులు చెబుతున్నారు.