Nepal: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది;

Update: 2024-07-24 06:54 GMT

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండులోని విమానాశ్రయంలో విమానం కుప్పకూలిపోయిన ఘటనలో ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక మీడియా బుధవారం నివేదించింది. పోఖారాకు వెళ్లే శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 11 గంటలకు మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో అందులో సిబ్బంది, సాంకేతిక సిబ్బందితో మొత్తం 19 మంది ఉన్నారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారని నేపాల్ మీడియా తెలిపింది. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంది, 19 ప్రయాణికులున్నారు. టేకాఫ్ అవుతుండగా కూలిపోవడంతో మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు, సిబ్బంది సజీవదహనమయ్యారు.

టేకాఫ్ అయిన క్షణాల్లోనే రన్‌వే నుంచి జారిపోవడంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. స్పాట్ కు సంబంధించిన వీడియోలను చూస్తుంటే.. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక టేబుల్‌టాప్ విమానాశ్రయం, ఇది అన్ని వైపులా లోతైన కనుమలు, లోయలతో చుట్టుముట్టబడిన పీఠభూమి పైభాగంలో ఉంది. 2023లో, పోఖారాపై యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిన ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా మొత్తం 72 మంది మరణించారు.


Tags:    

Similar News