నేటి నుంచి క్రికెట్ పండగ

నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

Update: 2022-03-26 01:45 GMT

క్రికెట్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ లో అద్భుతమైన షాట్లు, క్యాచ్ లు, బౌలింగ్, బ్యాటింగ్ ను చూసే వీలు ప్రతి అభిమానికి దక్కుతుంది. పొట్టి ఓవర్ల మ్యాచ్ లో దుమ్మురేపే స్కోర్ తో అత్యంత ఉత్కంఠ మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్ ఓవర్ వస్తే ఇక సంగతి సరేసరి. గుండెలు ఆగినంత పనవుతుంది. అందుకే ఐపీఎల్ అంటే అంత ఆసక్తి. నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.

మే 29న ఫైనల్....
ఈరోజు ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ముంబయి లో తొలి మ్యాచ్ చెన్నై - కోల్ కత్తా జట్ల మధ్య జరగనుంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా తగ్గడంతో ఈసారి మ్యాచ్ లన్నీ భారత్ లోనే జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. 2011 తర్వాత మ్యాచ్ లన్నీ ఎనిమిది జట్లతోనే నిర్వహించారు. ఈసారి కొత్తగా రెండు జట్లు జాయిన్ కావడంతో ఈసారి పది జట్లతో మ్యాచ్ లు జరగనున్ానయి. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వచ్చి చేరాయి.


Tags:    

Similar News