ముంబయి ఇక కోలుకుంటుందా?
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది
ఒకప్పుడు ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబయి జట్టు నేడు మైదానంలో తడబడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. వరస ఓటములతో ఆ జట్టు పట్టు కోల్పోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముంబయి అభిమానులు సయితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా విఫలం కావడంతో ఆ జట్టు ఇక కోలుకుంటుందా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
వరసగా విఫలమవుతూ...
కెప్టెన్ రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. తక్కువ స్కోరుకే విఫలమయ్యాడు. 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ మాత్రం 31 పరుగులు చేసి పరవాలేదని పించాడు. అనంతరం ముంబై జట్టు వరసగా వికెట్లను కోల్పోయింది. టిమ్ డేవిడ్ 31 పరుగులు చేయడంతో కొంత పరువు నిలబడింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేయగలిగింది. అయితే తర్వాత కొద్ది లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ లో రహానే విజృంభించాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు చేశఆడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా నలభై పరుగులు చేసి జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు.