ఆర్సీబీలోకి హర్షల్ పటేల్.. వార్నర్ ను దక్కించుకున్న డీసీ
ఇప్పటివరకూ అత్యధిక వేలానికి అమ్ముడుపోయిన లిస్ట్ శ్రేయాస్ అయ్యరే టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలోకి హర్షల్ పటేల్..
ఐపీఎల్ మెగా వేలం 2022 కొనసాగుతోంది. మధ్యలో ఆక్షనర్ స్పృహ తప్పి పడిపోవడంతో కొద్దిసేపు వేలం నిలిచిపోగా.. తిరిగి 3.30 గంటల నుంచి వేలం ప్రారంభమైంది. ఇప్పటివరకూ అత్యధిక వేలానికి అమ్ముడుపోయిన లిస్ట్ శ్రేయాస్ అయ్యరే టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలోకి హర్షల్ పటేల్ చేరుకున్నాడు. మెగావేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు హర్షల్ పటేల్ ను దక్కించుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ రూ.8 కోట్ల వేలంపాడి టీమిండియా ప్లేయర్ నితీష్ రానాను జట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ రూ.7.75 కోట్ల వేలానికి దేవ్ దత్ పడిక్కల్ ను సొంతం చేసుకుంది.
Also Read : తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు
ఇక కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ మనీష్ పాండేను రూ.4.6 కోట్లకు వేలం పాడింది. మరో టీమిండియా ఆటగాడైన రాబిన్ ఉతప్పను సీఎస్కే రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో అత్యల్ప వేలానికి అమ్ముడుపోయిన టీమిండియా ఆటగాడు రాబిన్ ఉతప్ప నే. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను రూ. 6.75 కోట్లకు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.8.75 కోట్లకు, టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో దక్కించుకుంది. వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.5 కోట్లకు, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్, వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావోను రూ.4.4 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ వేలంలో దక్కించుకున్నాయి.