ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి
ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి తప్పలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 23 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి తప్పలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 23 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల ను కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కొహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డుప్లెసిస్ 22 పరుగులు, మహిపాల్ లామ్రోర్ 26, మ్యాక్స్‌వెల్ 24 పరుగులు చేసి జట్టుకు పరవాలేదనిపించే స్కోరు చేశారు.
తడబడిన ఢిల్లీ...
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్ లోనే పృధ్వీషా రనౌట్ అయ్యారు. మిచెల్ మార్ష్ కూడా క్యాచ్ ఇచ్చి సున్నాకు అవుటయ్యడు. ఆరంభంగంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.