బ్యాటింగ్ కు దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.;
ఈరోజు ఐపీఎల్ 2022 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.
ఇరు జట్లు ఓటమి నుంచి....
చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలయింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయింది. ఇరు జట్లు తొలి మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో ఈ మ్యాచ్ లో గెలుపొందేందుకు సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తున్నారన్నది ఉత్కంఠగా మారింది.