IPL 2022 : ఆల్ రౌండర్లకే అధిక రేటు.. రెండోరోజు వేలం
ఐపీఎల్ 2022 వేలం రెండో రోజు ప్రారంభమయింది. అయితే ఈసారి ఆల్ రౌండర్లకు ఫ్రాంఛైజెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఐపీఎల్ 2022 వేలం రెండో రోజు ప్రారంభమయింది. అయితే ఈసారి ఆల్ రౌండర్లకు ఫ్రాంఛైజెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. సీనియర్ల వైపు కూడా జట్లు చూడటం లేదు. అజింక్యా రహానే వంటి ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఎవరూ పోటీ పడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చివరకు రహానేను కోల్ కత్తా నైట్ రైడర్స్ కేవలం కోటి రూపాయల బేస్ ప్రైస్ తో దక్కించుకోవడం విశేషం. ఒకప్పుడు రహానేను ఏడు కోట్లు చెల్లించి తీసుకున్నారు.
రెండో రోజు వేలం.....
ఇక మార్కరమ్ ని హైదరాబాద్ జట్టు 2.6 కోట్లు వెచ్చించి రెండోరోజు వేలంలో దక్కించుకుంది. మణిదీప్ సింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 1.10 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా ఆల్ రౌండర్ల వైపు అన్ని జట్లు మొగ్గు చూపాయి. వాషింగ్టన్ సుందర్ ను హైదరాబాద్ జట్టు 8 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే యువ ఆటగాడు నటరాజ్ నాలుగు కోట్లు, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాడికి నాలుగు కోట్లు మాత్రమే పలకడం విశేషం. ఈసారి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బౌలర్ల విభాగంలో పటిష్టంగా ఉండేలా ఫ్రాంఛైజెస్ ప్లాన్ చేసుకోవడంతో కుర్రాళ్లే కేక పుట్టిస్తున్నారు.