శిఖర్ ను దక్కించుకున్న పంజాబ్.. అత్యధిక రేటుకు అయ్యర్

ఐపీఎల్ 2022 వేలం ప్రారంభయింది. బెంగళూరులో జరుగుతున్న ఈ వేలంలో పది ఫ్రాంఛైజెస్ పాల్గొంటున్నాయి.

Update: 2022-02-12 07:11 GMT

ఐపీఎల్ 2022 వేలం ప్రారంభయింది. బెంగళూరులో జరుగుతున్న ఈ వేలంలో పది ఫ్రాంఛైజెస్ పాల్గొంటున్నాయి. ఈసారి కొత్తగా ఐపీఎల్ లోకి రెండు జట్లు రావడంతో వేలం పది జట్ల మధ్య జరగనుంది. కొత్త జట్లు రావడంతో పాత జట్లు తమ వద్ద నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని ఆక్షన్ లో ఉంచుతారు. అందుకే ఈసారి క్యాప్, అన్ క్యాప్డ్ ఆటగాళ్లు అనేక మంది ఆక్షన్ లో నిలిచారు.

అత్యధిక రేటుకు రబాడా
అయితే తాజాగా జరిగిన వేలంలో శిఖర్ ధావన్ ను ఈసారి పంజాబ్ ఎలెవెన్ జట్టు దక్కించుకుంది. గత సీజన్ లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడేవారు. ఈసారి పంజాబ్ ధావన్ ను 8.25 కోట్లకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ అశ్విన్ ను ఐదు కోట్లకు చేజిక్కించుకుంది. ప్యాట్ కమిన్స్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 7.25 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతానికి రబాడాను పంజాబ్ జట్టు 9.25 కోట్లకు దక్కించుకుంది. ట్రెంట్ బౌల్ట్ ను రాజస్థాన్ ఎనిమిది కోట్లకు చేజిక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్ ను 12.25 కోట్లకు పంజాబ్ జట్టు దక్కించుకుంది.


Tags:    

Similar News