IPL 2023 : ఆరంభం అదరహో

ఐపీఎల్ 2023 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 16వ సీజన్ అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభించడానికి ప్లాన్ చేశారు.

Update: 2023-03-30 03:40 GMT

వీకెండ్‌ నుంచి అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 16వ సీజన్ అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. మూడు సీజన్ల తర్వాత మళ్లీ ఈసారి హోం, అవే పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఇక ఐపీఎల్ జట్ల ఫ్యాన్స్ కు ఫెస్టివల్ అని చెప్పక తప్పదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన జట్లు చెలరేగి ఆడుతుంటే నోరెళ్లబెట్టి చూడక తప్పదు. అంచనాలకు భిన్నంగా విజేతలు. ప్రతి రోజూ ఇదే రకమైన అనుభవం ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు అందబోతుంది.

మొత్తం 74 మ్యాచ్‌లు...
ఒక్కొక్క జట్టు తన హోం పిచ్‌లు ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశముంది. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఉప్పల్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు జరగబోతున్నాయి. పది ప్రధాన నగరాల్లో ఐపీఎల్ ను నేరుగా వీక్షించే అవకాశం ఫ్యాన్స్ కు ఈసారి లభించింది. రెండు నెలల పాటు ఇక ఫ్యాన్స్‌కు తీరికుండదు. దాదాపు 74 మ్యాచ్‌లు జరుగుతాయి. మేలురకం ఆటగాళ్లు మైదానంలో చెలరేగి ఆడుతుంటే ఇక పండగ కాక మరేంటి? తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 31వ తేదీన ప్రారంభం కానుంది.
బాలీవుడ్ తారలతో...
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే ఓపెనింగ్ కార్యక్రమానికి బాలివుడ్ తారలు వచ్చే అవకాశముందంటుననానరు. దాదాపు లక్ష మందికి పైగా ప్రారంభోత్సవ పండగను చూసే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్,టాలీవుడ్ నటి తమన్నాతో పాటు అరిజిత్ సింగ్ లాంటి వాళ్లు తమ పెర్‌ఫార్మెన్స్ ను ప్రదర్శించబోతున్నారు. మొత్తం 74 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. రానురాను రోజుకు రెండు మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.
క్షణం క్షణం టెన్షన్...
ఈ ఐపీఎల్‌లో తొలి లీగ్ రౌండ్ పాల్గొనే మొత్తం పది జట్లు పథ్నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. లీగ్ రౌండ్‌లోనే మొత్తం డెబ్భయి మ్యాచ్ లు జరపాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. ఆ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్ లు నాలుగు జరగనున్నాయి. ఇప్పటికే ఏ మ్యాచ్ ఏ జట్టుతో తలపడేది నిర్ణయం జరిగింది రెండు విభాగాలుగా చేసి మ్యాచ్‌లను ఆడించనున్నారు. సో... రేపటి నుంచి ఇక టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఐపీఎల్ సీజన్ 16 అందరినీ అలరిస్తుందని ఆశిద్దాం.


Tags:    

Similar News