టీ20 వేలంలో అపశృతి.. స్పృహతప్పి పడిపోయిన ఆక్షనర్

మెగా వేలంలో ఆక్షనర్ హ్యూజ్ ఎడ్మర్డ్స్ స్పృహ తప్పి కిందపడిపోయారు. శ్రీలంక ఆల్ రౌండర్ వానిందు హసరంగ వేలం

Update: 2022-02-12 09:34 GMT

శనివారం ఉదయం బెంగళూరులో ఐపీఎల్ 2022 మెగా వేలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఈ వేలం జరగనుంది. మొత్తం 10 టీమ్ లు, 590 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ దే హైయెస్ట్ రెమ్యునరేషన్. కాగా.. వేలం జరుగుతున్న సమయంలో చిన్న అపశృతి జరిగింది.

మెగా వేలంలో ఆక్షనర్ హ్యూజ్ ఎడ్మర్డ్స్ స్పృహ తప్పి కిందపడిపోయారు. శ్రీలంక ఆల్ రౌండర్ వానిందు హసరంగ వేలం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆయనకు కళ్లు తిరిగి, స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, కొద్దిసేపటికే మళ్లీ కోలుకున్నారని తెలుస్తోంది. ఆక్షనర్ స్పృహ కోల్పోవడంతో ఐపీఎల్ వేలాన్ని తాత్కాలికంగా ఆపారు. తిరిగి 3.30 గంటలకు వేలం పునః ప్రారంభం కానుంది. వేలం ప్రారంభమవ్వగానే.. శిఖర్ ధావన్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ వేలంలో దక్కించుకుంది. 


Tags:    

Similar News