ఓటమి ఇంత దారుణమా?
కొహ్లి టీంకు ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయం పాలయింది
కొహ్లి టీంకు ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు, బౌలింగ్‌లో పూర్తిగా విఫలం కావడంతో రన్‌రేటులో కూడా బెంగళూరు జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 68, రెహ్మనుల్లా గుర్బాజ్ 57, రింకూ సింగ్ 46 పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరును అందించారు.
81 పరుగుల తేడాతో...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఆదిలోనే తడబడింది. ఓపెనర్లుగా దిగిన విరాట్ కొహ్లి, డూప్లిసెస్‌లు వెంట వెంటనే అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. స్పిన్నర్ల ధాటికి బెంగళూరు బ్యాటర్లు కకావికలం అయిపోయారు. ఒక్కరూ సరిగా క్రీజులో నిలబడలేకోయారు. దీంతో 17.4 ఓవర్లలో ఆ జట్టు 123 పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో బెంగళూరు జట్టు ఘోర పరాజయం పాలయింది.