తడబడినా .. ఎట్టకేలకు గెలిచి...?
టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది.
అతి తక్కువ స్కోరు. సునాయాస విజయం అనుకున్నారంతా. కానీ చివరి బాల్ వరకూ ఉత్కంఠే. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా టెన్షన్ పెట్టింది. టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. అయితే నైట్ రైడర్స్ పెద్దగా రాణించలేకపోయారు. వికెట్లు టప టపా పడటంతో అతి తక్కువ స్కోరు చేసింది. కేవలం 128 పరుగులు మాత్రమే చేసింది.
లక్ష్యం చిన్నదే అయినా....
129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ లో కూడా ఆటగాళ్లు తక్కువేమీ తినలేదు. ఓపెనర్లు అనూజ్ రావత్, డూప్లిసెస్, విరాట్ కొహ్లి వరసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో టెన్షన్ మొదలయింది. అయితే దినేష్ కార్తిక్, హర్షల్ పటేల్ లు చివరకు మ్యాచ్ ను ముగించడంతో అందరూ ఊపిరి పీల్చుకు్న్నారు. చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టేశారు. మొత్తం మీద రాయల్ ఛాలెంజర్స్ తడబడినా చివరకు గెలిచి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.