రెండూ గట్టి జట్లే... గెలుపు ఎవరిదో?
మరికాసేపట్లో ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆడనుంది
నేడు క్రికెట్ అభిమానులకు పండగ. అలాంటి మ్యాచ్ జరగబోతుంది. మరికాసేపట్లో ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆడనుంది. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన ఉత్సాహంతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఉంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలయింది. రెండు జట్లకు ఐపీఎల్ లో ఇది రెండో మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తాయి.
30వ మ్యాచ్....
ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లోనూ సిక్సర్ల మోత కన్పించనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు బలమైనవి కావడంతో గెలుపోటములు చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 29 సార్లు తలపడగా, కోల్‌కత్తా నైట్ రైడర్స్ 16 మ్యాచ్ ల్లోనూ, బెంగళూరు 13 మ్యాచ్ లోనూ గెలిచిన రికార్డు ఉంది. ఈరోజు జరగబోయే మ్యాచ్ 30వది. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది.