కోల్‌కత్తాదే పైచేయి... పంజాబ్ కు నిరాశ

ఆరు వికెట్ల తేడాతో కోల్ కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది.

Update: 2022-04-02 02:04 GMT

ఎలాంటి ఉత్కంఠ లేదు. ఆరు వికెట్ల తేడాతో కోల్ కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ వికెట్లను టపా టపా కోల్పోయింది. 137 పరుగులు మాత్రమే సాధించింది. కేవలం 18.2 ఓవర్లలోనే ఆల్ అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ అతి చిన్న లక్ష్యాన్ని కోల్ కత్తా నైట్ రైడర్స్ ముందుంచింది.

లక్ష్యం చిన్నదే అయినా....
అయితే 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా కొంత తడబడింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు వరసగా పెవిలియన్ బాట పట్టారు. అయితే ఆండ్రీ రసెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ పథాన నడిపారు. కవేలం 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది.


Tags:    

Similar News