ఎలా ఉన్నా మ్యాచ్ గెలిపించేది ఇతనే
లక్నో సూపర్ జెయింట్స్ 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. లక్ష్యం లక్నో జట్టుకు చిన్నదిగానే కన్పించింది
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూసిన వారెవరైనా ఓటమి పాలు తప్పదనుకున్నారు. నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి ఉంది. ఆ పరిస్థితి దాకా లక్నో జట్టు తెచ్చుకుంది. బ్యాటర్లు రాణించినా మ్యాచ్ ముగించకుండా జట్టును కష్టాల్లోకి నెట్టినప్పుడల్లా బదోనీ వచ్చి గెలిపించడం ఆనవాయితీగా మారింది. నిన్న కూడా అదే జరిగింది. దాదాపు లక్నో అభిమానులంతా పూర్తి నిరాశలో ఉన్న సమయంలో బదోని వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
లక్ష్యం చిన్నదే అయినా...
లక్నో సూపర్ జెయింట్స్ 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. లక్ష్యం లక్నో జట్టుకు చిన్నదిగానే కన్పించింది. డీకాక్ 80 పరుగులు, కేఎల్ రాహుల్ 24 లు చేశారు. దీపక్ హుడా, ఎవిన్ లూయీస్ బ్యాటింగ్ లో నిరాశపర్చారు. ఇక రెండు బంతులు మిగిలి ఉండగానే కృనాల్ పాండ్య, బదోనిలు కలసి జట్టుకు విజయాన్ని అందించారు. బదోని చివర్లో చేసిన11 పరుగులే ఆ జట్టును గెలుపు ముంగిట నిలిపాయి.