టాస్ గెలిచిన లక్నో.. చెన్నైతో అమీతుమీ

చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మ్యాచ్ జరగబోతుంది

Update: 2023-04-03 13:50 GMT

చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మ్యాచ్ జరగబోతుంది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో జరుగుతుంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే రెండు టీం లు రెండు మ్యాచ్‌లు ఆడాయి.

రెండు టీంలు...
ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయింది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ మీద విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో బోణీ కొట్టలేదు. అందుకే ఈ మ్యాచ్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోంగ్రౌండ్‌లో జరగనున్నందున ఈ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకుంది. మరో వైపు లక్నో జట్టు కూడా బలంగా ఉంది. ఇరు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ లాంటిదేనని చెప్పాలి.


Tags:    

Similar News