బెంగళూరుదే జయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది

Update: 2023-04-23 14:01 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. చివరి బాల్ వరకూ ఫలితం తేలలేదు. మరోసారి ఈ మ్యాచ్ అభిమానులను టెన్షన్‌కు గురి చేసింది. కీలక సమయంలో వికెట్లు పడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగా ఇబ్బందిగానే మారింది. రవిచంద్రన్ అశ్విన్ రెండు బాల్స్ ఉండగా అవుటయ్యాడు. ఇక రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండింది. ఎలాంటి మ్యాజిక్ జరగపోవడంతో చివరకు బెంగళూరు జట్టునే విజయం వరించింది.

ధాటిగా ఆడినా...
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్‌లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. కొహ్లి తలి బంతికే అవుటయినా మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఆడటంతో భారీ స్కోరు లభించింది. డుప్లిసెస్ 39 బాల్స్‌లో 62 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 44 బంతుల్లో 77 పరుగులు చేయడంతో భారీ స్కోరు లభించింది. అయితే అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి కఠినంగా మారింది. 19 ఓవర్ లో జురెల్ సిక్సర్ కొట్టడంతో కొంత ఆశాజనకంగా మారినా చివరకు విజయం బెంగళూరునే వరించింది.


Tags:    

Similar News