సీఎస్ కే పగ్గాలు మళ్లీ ధోనీకే !

జట్టుకు సంబంధించి విస్తృత ప్రయోజనాల నేపథ్యంలో మరోసారి నాయకత్వం వహించేందుకు ధోనీ అంగీకరించాడు" అంటూ సీఎస్కే..

Update: 2022-05-01 04:25 GMT

ముంబై ఇండియన్స్ లాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్ లో గొప్ప ప్రదర్శన చేయలేక పోయింది. ఇక ఈ సీజన్ ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుండి తప్పుకుని రవీంద్ర జడేజాకు పగ్గాలు అందించాడు. అయితే అనుకున్నట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముందుకు వెళ్ళలేదు. అందుకే జడ్డూ కెప్టెన్సీని వదిలేయాలని ఫిక్స్ అయ్యాడు. తాను ఇక కెప్టెన్ గా కొనసాగలేనని రవీంద్ర జడేజా జట్టు యాజమాన్యానికి తన నిర్ణయం తెలియజేశాడు. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ ఓ ప్రకటన చేసింది. జడేజా సీఎస్కే కెప్టెన్సీని మళ్లీ ధోనికి అప్పగించేశాడు.

"తన ఆటపై మరింత దృష్టి నిలిపేందుకు వీలుగా కెప్టెన్సీ వదులుకోవాలని జడేజా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, మళ్లీ పగ్గాలు స్వీకరించాల్సిందిగా ధోనీని కోరాడు. జట్టుకు సంబంధించి విస్తృత ప్రయోజనాల నేపథ్యంలో మరోసారి నాయకత్వం వహించేందుకు ధోనీ అంగీకరించాడు" అంటూ సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడగా.. ఆ జట్టు గెలిచింది రెండు మ్యాచ్ లే. డిఫెండింగ్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉండడంతో జడేజాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే ధోనికే పగ్గాలు తిరిగి అప్పగించారు.
చాలా సంవత్సరాలుగా జట్టుకు స్టార్ పెర్ఫార్మర్‌గా ఉన్న జడేజా, ఈ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఎనిమిది గేమ్‌లలో 112 పరుగులు, ఐదు వికెట్లు (సగటు 42, 8.19 ఎకానమీ రేట్) మాత్రమే చేశాడు. అద్భుతమైన ఫీల్డర్ అయిన జడేజా క్యాచ్‌లను కూడా విడిచిపెట్టడం మనం చూశాం. CSK ప్రస్తుతం ఎనిమిది గేమ్‌లలో రెండు విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లే-ఆఫ్స్‌లో బెర్త్ కోసం తక్కువ ఛాన్స్ లే ఉండడంతో.. ధోని తిరిగి బాధ్యతలు చేపడితే అవకాశాలు మెరుగుపడడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌లో ఉంది.


Tags:    

Similar News