IPL 2022 : ట్రాక్ రికార్డ్... హిస్టరీని చూసే... కోట్లు

నేడు ఐపీఎల్ రెండో రోజు ఆటగాళ్ల ఆక్షన్ జరగనుంది. నిన్న ప్రారంభమైన వేలం నేటితో ముగియనుంది.

Update: 2022-02-13 01:54 GMT

నేడు ఐపీఎల్ రెండో రోజు ఆటగాళ్ల ఆక్షన్ జరగనుంది. నిన్న ప్రారంభమైన వేలం నేటితో ముగియనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ వేలంలో ఇప్పటికే 74 మంది ఆటగాళ్లను పది జట్లు దక్కించుకున్నాయి. ఇషాన్ కిషన్ అత్యధికంగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించారు. దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా తొలి రోజు అత్యధిక ధరకు అమ్ముడు పోయారు. నిన్న జరిగిన వేలంలో ఇషాంత్ కిషన్ 15.25 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇదే తొలిరోజు అత్యధిక ధర.

రెండోరోజు....
ఈరోజు రెండో రోజు వేలం జరగనుంది. నిన్న వేలంలో 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు జట్లు ఆసక్తి చూపలేదు. ఈరోజు జరిగే వేలంలో నిన్నటి మాదిరి ధర పలకడం కష్టమని చెబుతున్నారు. మొత్తం పది జట్లు ఈ వేలంలో పాల్గొటున్నాయి. ట్రాక్ రికార్డు ను చూసి కొనుగోలు చేస్తుండటంతో కొందరికి ఐపీఎల్ లో మంచి హిస్టరీ ఉన్నా వారికి ఎక్కువ ధర పలకలేదు. మరికొందరికి ఊహించనంతగా ధర పలికింది. ప్రసిద్ధ కృష్ణ గత సీజన్ లో కేవలం ఇరవై లక్షలకే అమ్ముడుపోయినా ఈసారి అతని పెరఫార్మెన్స్ పదికోట్లను తెచ్చిపెట్టింది.


Tags:    

Similar News