జెర్సీ మార్చినా జయం లభించేనా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఇరవై ఓవర్‌లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది
టాస్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేసింది. ఇరవై ఓవర్‌లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. కొహ్లి తలి బంతికే అవుటయినా మ్యాక్స్‌వెల్ సక్సెస్‌ఫుల్ గా ఆడటంతో భారీ స్కోరు చేయగలిగింది. జెర్సీ మార్చిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ మ్యాచ్‌ను గెలుచుకుంటుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలొకంది.
భారీ స్కోరు చేసినా...
డుప్లెసిస్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బాల్స్‌లో 62 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 44 బంతుల్లో 77 పరుగులు చేయడంతో భారీ స్కోరు లభించింది. ప్రస్తుతం 9.4 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 92 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. ఛేదనలో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టును తక్కువ అంచనా వేయలేం. అందుకే జెర్సీ మార్చినా ఫలితం ఉంటుందా? అన్న చర్చ గ్రౌండ్‌లో జరుగుతుంది. జైశ్వాల్, పడిక్కల్ క్రీజులో ఉన్నారు.