బోణి కొట్టింది.. అదర కొట్టారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. ముంబయి ఇండియన్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది

Update: 2023-04-03 04:49 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. ముంబయి ఇండియన్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. అసలు ఓపెనర్లే మ్యాచ్‌ ను ముగిస్తారని భావించినా డూప్లెసెస్ అవుట్ కావడంతో రెండు వికెట్లు కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని బెంగళూరు సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఆది నుంచి తడపడింది. రోహిత్ శర్మతో పాటు వరసగా వికెట్లు కోల్పోవడంతో ముంబయి 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ముంబయి వంద పరుగులకు మించదని భావించారు.

తిలక వర్మ శ్రమ వృధా...
కానీ హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ బ్యాట్ ను ఝుళిపించాడు. 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం ఏడు వికెట్లు కోల్పోయి ముంబయి జట్టు 176 పరుగులు చేసింది. అయితే తర్వాత బరిలోకి దిగిన బెంగళూరు జట్టు తిరుగులేని జవాబు ఇచ్చింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కొహ్లి, డూప్లిసెస్ క్రీజ్‌కు అతుక్కుపోయారు. కొహ్లి 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాదాడు. డుప్లిసెస్ 73 పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ వెంటనే అవుట్ కావడంతో మ్యాక్స్‌వెల్ మైదానంలో కాలుమోపి సిక్స్‌తో ప్రారంభించాడు. అప్పటికే బెంగళూరు విజయం ఖాయమయిపోయింది. చివరకు కొహ్లి ఒక సిక్స్ బాది బెంగళూరుకు విజయాన్ని అందించారు. మ్యాక్స్‌వెల్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు.


Tags:    

Similar News