IPL AUCTION 2022 : అత్యధిక వేలానికి అమ్ముడుపోయిన శ్రేయాస్

ఇప్పటివరకూ జరిగిన వేలంలో.. అత్యధిక రేటుకు అమ్ముడుపోయాడు శ్రేయాస్ అయ్యర్. టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను

Update: 2022-02-12 07:25 GMT

క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఆరంభమైంది. బెంగళూరులో ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభమవ్వగా.. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆరంభించింది. శిఖర్ ధావన్, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దక్కించుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకుంది.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో.. వీరందరికన్నా అత్యధిక రేటుకు అమ్ముడుపోయాడు శ్రేయాస్ అయ్యర్. టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.12.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది. అలాగే టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ రూ. 6.25 కోట్లకు వేలం పాడింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డుప్లెసిస్‌ను రూ.7 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు దక్కించుకుంది.


Tags:    

Similar News