థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచిన హైదరాబాద్

గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయం సాధించింది. రెండు పాయింట్లు అయితే వచ్చాయి కానీ.. నెట్ రన్ రేట్ మాత్రం దక్కకపోవడం హైదరాబాద్ కు నిరాశ కలిగించే అంశం.

Update: 2022-05-18 02:54 GMT


గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయం సాధించింది. రెండు పాయింట్లు అయితే వచ్చాయి కానీ.. నెట్ రన్ రేట్ మాత్రం దక్కకపోవడం హైదరాబాద్ కు నిరాశ కలిగించే అంశం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించినా.. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ దాదాపుగా ముంబై ఇండియన్స్ దే అనుకున్న సమయంలో హైదరాబాద్ విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి రాణించడంతో 193 పరుగుల భారీ స్కోరు సాధించిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌ను 190 పరుగులకు కట్టడి చేసి విజయాన్ని అందుకుంది. చివర్లో ముంబై ఆటగాడు టిమ్ డేవిడ్ అవుట్ అవ్వడంతో విజయం హైదరాబాద్ ను వరించింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు, ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు, ఆఖర్లో టిమ్ డేవిడ్ కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించకపోవడంతో ముంబైకి మరో ఓటమి దక్కింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు మూడు వికెట్లు దక్కాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ చేయాలని.. నెట్ రన్ రేట్ సాధించాలనే ఆడింది. కెప్టెన్ విలియమ్సన్ లోయర్ ఆర్డర్ లోకి వచ్చి.. మిగిలిన వారిని ముందుకు ప్రమోట్ చేశాడు. ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠీ, పూరన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. గార్గ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42, పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో రమణ్‌దీప్‌కు మూడు వికెట్లు దక్కాయి. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు రాహుల్ త్రిపాఠికి దక్కింది.


Tags:    

Similar News