ఛేజింగ్ లో తడబడి.. వికెట్లు కోల్పోయి
సన్ రైజర్స్ స్కోర్ ను ఛేజ్ చేయలేక చేతులెత్తేసింది. ఘోరంగా ఓటమి పాలయింది. తొలి మ్యాచ్ లోనే పరాజయాన్ని మూటకట్టుకుంది.
ఐపీఎల్ లో ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలిచాయి. ఎంత ఎక్కువ స్కోరు ఉన్నా దానిని చేజ్ చేయడంలో అన్ని టీంలు సక్సెస్ అయ్యాయి. అయితే ఒక్క సన్ రైజర్స్ విషయంలో మాత్రం ఇది కుదరలేదు. సన్ రైజర్స్ స్కోర్ ను ఛేజ్ చేయలేక చేతులెత్తేసింది. ఘోరంగా ఓటమి పాలయింది. తొలి మ్యాచ్ లోనే పరాజయాన్ని మూటకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో సత్తా చాటింది.
61 పరుగుల తేడాతో...
హైదరాబాద్ సన్ రైజర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చప్పగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 210 పరుగులు చేసింది. అతి పెద్ద స్కోర్ ను ఛేజ్ చేయాల్సిన సన్ రైజర్స్ తొలి ఓవర్లలోనే తడబడింది. చివరకు 149 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. 61 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి పాలుకాగా, రాజస్థాన్ రాయల్స్ గెలుపును సొంతం చేసుకుంది.