అండర్ -19 ఆటగాళ్లకు కలిసొచ్చిన ఐపీఎల్ వేలం

ఈ వేలం పలువురు అండర్ 19 ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. అండర్‌-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను

Update: 2022-02-13 12:09 GMT

ఇటీవలే వెస్టిండీస్ లో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ను టీమిండియా ఆటగాళ్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆటగాళ్లను ఐపీఎల్ వేలం రూపంలో జాక్ పాట్ వరించింది. ఈ వేలం పలువురు అండర్ 19 ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. అండర్‌-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అలాగే ఆల్ రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా పేస్ బౌలింగ్ లో స్పెషలిస్ట్. అలాగే మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయగలడు.

అండర్-19 టీమిండియాకు చెందిన మరో ఆల్ రౌండర్ రాజ్ వర్ధన్ హంగార్గేకర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.5 కోట్లకు జట్టులోకి తీసుకుంది. ఇతను టీనేజ్ లోనే స్పీడ్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫాస్ట్ బౌలింగే కాకుండా.. బ్యాటింగ్ లోనూ విరుచుకుపడటం.. హంగార్గేకర్ సొంతం. వీరితో పాటు పలువురు అండర్ 19 ప్లేయర్స్ ను పలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ ఐపీఎల్ వేలం.. అండర్ 19 ప్లేయర్లకు కలిసొచ్చింది.



Tags:    

Similar News