వాషింగ్టన్ సుందర్ ను కొనుగోలు చేసిన హైదరాబాద్

గతేడాది ఆర్సీబీ కొనుగోలు చేసిన ఈ ఆటగాడిని ఈ ఏడాది హైదరాబాద్ టీమ్ రూ. 8.75 కోట్లకు జట్టులోకి తీసుకోవడం విశేషం. ఆర్‌సీబీ తరపున

Update: 2022-02-12 11:43 GMT

ఐపీఎల్ సీజన్ 2022 మెగా వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ టీమిండియా ఆటగాళ్లైన శ్రేయాస్ అయ్యర్, హర్షల్ పటేల్ లు అత్యధిక వేలానికి అమ్ముడుపోయారు. మిగతా ఆటగాళ్లంతా రూ.10 కోట్ల లోపే ఆయా టీమ్ లలోకి వెళ్లిపోయారు. భారత స్పిన్నర్, ఆల్ రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ను ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి తీసుకుంది. గతేడాది ఆర్సీబీ కొనుగోలు చేసిన ఈ ఆటగాడిని ఈ ఏడాది హైదరాబాద్ టీమ్ రూ. 8.75 కోట్లకు జట్టులోకి తీసుకోవడం విశేషం.

ఆర్‌సీబీ తరపున రూ.3.25 కోట్లతో ఉన్న సుందర్‌కు ఈసారి రూ. 5 కోట్లు ఎక్కువగా వేలం రావడం ఆశ్చర్యపరుస్తోంది. అలాగే తెలుగు తేజమైన అంబటి రాయుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ గూటికే చేరాడు. రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రాయుడి కోసం ఎస్ఆర్ హెచ్ - సీఎస్కే పోటీ పడగా.. ఎస్ ఆర్ హెచ్ రూ.6 కోట్లతో ఆగిపోయింది. దాంతో రూ.6.75 కోట్లకు రాయుడిని మళ్లీ సీఎస్కేనే సొంతం చేసుకుంది.


Tags:    

Similar News