Maha Shivaratri : మహా శివరాత్రి అంటే ఏమిటి ? ఎలా జరుపుకోవాలి ?
హిందూ పండుగలన్నీ.. ప్రత్యేక మాస,తిథి, నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి. ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు..
మహా శివరాత్రి. ఏడాదికి 12మాస శివరాత్రులుంటే.. ఒకే ఒక్క మహాశివరాత్రి ఉంటుంది. ఈ రోజున శివుని భక్తులంతా అత్యంత నిష్టగా ఉపవాసం ఉండి.. సాయంకాలం శివుణ్ణి దర్శించుకున్న అనంతరం.. పండ్లు, పాలు తీసుకుని ఉపవాస విరమణ చేస్తారు. అలాగే రాత్రంతా జాగరణ చేస్తారు. అలా అని మరునాడు ఉదయం పడుకోకూడదు. అలా చేస్తే.. ఉపవాస, జాగరణ ఫలితం దక్కదన్నది భక్తుల నమ్మకం. అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుంటామో తెలుసుకుందాం.
హిందూ పండుగలన్నీ.. ప్రత్యేక మాస,తిథి, నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి. ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అమావాస్యకు ముందు వచ్చే.. కృష్ణపక్ష చతుర్థశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం. అన్ని పండుగలను పగలు జరుపుకుంటాం. ఒక్క దీపావళి తప్ప. అలాగే మహాశివరాత్రిని కూడా రాత్రివేళలోనే జరుపుకుంటాం. మహాశివరాత్రిగా పిలువబడే రోజున అర్థరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలంగా భావిస్తారు.
ఈ రోజున ఉపవాసాలు ఉండి.. మనస్సంతా దైవన్నామస్మరణ చేస్తూ.. రాత్రి వేళ శివానుగ్రహం కోసం జాగరణ చేస్తారు. లింగాకారంలో ఉండే శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజుని హిందువులు, శైవులు అత్యంత పుణ్యప్రదమైన రోజుగా భావిస్తారు. శివుడు జ్యోతిర్లింగాకారం దాల్చిన రోజే మహా శివరాత్రి.