ఒకరోజు మాత్రమే తెరుచుకునే శివాలయం
శివరాత్రి రోజునే తెరుచుకునే ఆలయం ఒకటుంది. దేశంలో దీనికి ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయం తెరుచుకుంటుంది
శివరాత్రి రోజునే తెరుచుకునే ఆలయం ఒకటుంది. దేశంలో దీనికి ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయం తెరుచుకుంటుంది. అదే రోజు ఆలయాన్ని మూసివేస్తారు. మధ్యప్రదేశ్ లోని రాయ్‌సేన్ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా ఈరోజు తెరుచుకుంది. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరవడం ఒక ప్రత్యేకత. రాత్రికి మరలా ఆలయాన్ని మూసివేయడం సాంప్రదాయంగా వస్తుంది.
శివరాత్రి రోజులనే
రాజధాని భోపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ శివాలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అనంతరం ఈ ఆలయం అనేకమంది ముస్లింరాజుల అధీనంలోకి వెళ్లిందని చరిత్ర చెబుతుంది సామాన్య ప్రజల కోసం ఆలయం తెరవాలంటూ 1974లో పెద్దయెత్తున ఉద్యమం జరిగింది కూడా. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని తెరిపించారు. కానీ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తామని చెప్పారు.
సోమేశ్వర ఆలయం...
అప్పటి నుంచి ఈ సోమేశ్వర ఆలయం కేవలం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే శివుడికి పూజలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది. శివరాత్రి కావడంతో ఈరోజు ఆలయ ద్వారాలను తెరిచారు. పూజలు నిర్వహిస్తున్నారు. తిరిగి సాయంత్రం మూసివేస్తారు. కేవలం పన్నెండు గంటల పాటు మాత్రమే ఇక్కడ శివుడికి పూజలు నిర్వహిస్తారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరుచుకునే ఈ ఆలయానికి భక్తులు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. శివయ్యకు పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేశారు.