శైవక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా?
శివరాత్రికి శైవక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను శైవ క్షేత్రాలకు నడుపుతుంది.
శివరాత్రి రోజు శైవక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను శైవ క్షేత్రాలకు నడుపుతుంది. మొత్తం 2,427 ప్రత్యేక సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. భక్తుల సౌకర్యవంతంగా, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీని ఎంచుకోవాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
40 శైవ క్షేత్రాలకు 2,427 బస్సులు...
మొత్తం 40 శైవ క్షేత్రాలకు 2,427 బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట, ఏడుపాయలు, కాళేశ్వరం, కొమురవెల్లి, కొండగట్టు, అలంపూర్, రామప్ప, ఉమా మహేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, దిల్‌సుఖ్ నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ కాలనీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం వెళ్లేవారికి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రద్దీకి అనుగుణంగా అవరమైతే మరిన్ని సర్వీసులను కూడా భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.