అక్టోబర్ కాదు.. నవంబర్ అంటున్న చిరు?

అందరూ షూటింగ్ షెడ్యూల్స్ వేసుకుని సెట్స్ మీదకెళుతుంటే చిరు – కొరటాల కాంబో ఆచార్య సినిమా ఎప్పుడు మొదలెడుతున్నారో క్లారిటి ఇవ్వకుండా ఇంకా నాన్చుతూనే ఉన్నారు. నాగార్జున, [more]

Update: 2020-09-24 04:29 GMT

అందరూ షూటింగ్ షెడ్యూల్స్ వేసుకుని సెట్స్ మీదకెళుతుంటే చిరు – కొరటాల కాంబో ఆచార్య సినిమా ఎప్పుడు మొదలెడుతున్నారో క్లారిటి ఇవ్వకుండా ఇంకా నాన్చుతూనే ఉన్నారు. నాగార్జున, బాలయ్య లు కూడా తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ రాధేశ్యాం అక్టోబర్ నుండి సెట్స్ మీదకెళుతుంది. అయితే కొరటాల శివ కూడా ఆచార్య సినిమాని మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. చిరంజీవి కూడా కోరటాలతో ఇక సినిమా మొదలెడదామని చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమా షూటింగ్ కి హాజరవుతాడని, తర్వాతె రాజమౌళి RRR సెట్స్ లో పాల్గొంటాడనే న్యూస్ నడిచింది.

అయితే తాజాగా కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాని కారణంగా చిరంజీవి కొరటాలతో అప్పుడే సినిమాని మొదలు పెట్టొద్దు… అక్టోబర్ లో షెడ్యూల్ వెయ్యొద్దు.. అక్టోబర్ లో పరిస్థితులు అదుపులకి వస్తే నవంబర్ నుండి సినిమాని పట్టాలెక్కిద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కొరటాల కూడా కంగారెందుకు చిరు చెప్పినట్టుగానే చేద్దామని చిత్ర బృందానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే జూన్ నుండి సినిమా షూటింగ్ మొదలైతే వచ్చే వేసవి ఏప్రిల్ కి ఆచర్యని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. కరోనా రాకముందు జనవరిలో ఆచార్య విడుదలయ్యేది. కానీ మొన్నటికి మొన్న ఏప్రిల్ అన్నారు. ఇక నవంబర్ నుండి ఆచార్య షూటింగ్ మొదలైతే సినిమా కచ్చితంగా ఏప్రిల్ లో వచ్చే ఛాన్స్ లేదు. మరి ఆచార్య విడుదల డేట్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో చూడాలి. 

Tags:    

Similar News