అనసూయ కోరుకున్న పాత్ర తగిలిందా?

జబర్దస్త్ హాట్ యాంకర్ వెండితెర మీద అవకాశాలు రావాలే గాని.. రెక్కలు కట్టుకుని వాలిపోతుంది. కానీ అనసూయ కి ఆశించిన పాత్రలు మాత్రం దక్కడం లేదు. రంగస్థలంలో [more]

Update: 2020-11-11 15:31 GMT

జబర్దస్త్ హాట్ యాంకర్ వెండితెర మీద అవకాశాలు రావాలే గాని.. రెక్కలు కట్టుకుని వాలిపోతుంది. కానీ అనసూయ కి ఆశించిన పాత్రలు మాత్రం దక్కడం లేదు. రంగస్థలంలో అనసూయ కి మంచి రోల్ తగిలినా అది గ్లామర్ పాత్ర కాదు.. ఇక కొన్ని సినిమాల్లో అనసూయకి ఫుల్ లెన్త్ రోల్స్ వచ్చాయి కానీ.. అవి అంతగా వర్కౌట్స్ అవ్వలేదు. తాజాగా అనసూయ కృష్ణవంశీ రంగ మార్తాండ లో కీ రోల్ ప్లే చేస్తుంది. చిరు ఆచర్యలో అనసూయ ఓ పాత్రలో కనిపించబోతుంది అంటున్నారు కానీ.. క్లారిటీ లేదు. అనసూయకి ఎక్కువగా గ్లామర్ పాత్రలంటే మోజు. కానీ దర్శకులు అనసూయ కోసం గ్లామర్ పాత్రలు రాయడం లేదు. అయితే తాజాగా రవితేజ ఖిలాడీలో ఈ జబర్దస్త్ హాటీ కూడా నటించబోతుంది అనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు రవితేజ రమేష్ వర్మతో ఖిలాడీ సినిమాని అనౌన్స్ చేసేసాడు. గోపీచంద్ తో క్రాక్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేసి.. సంక్రాంతికి రిలీజ్ అన్న రవితేజ అంతే స్పీడుగా ఖిలాడీ షూటింగ్ సెట్స్ కి వెళ్ళిపోయాడు. రమేష్ వర్మతో ఖిలాడీ మూవీ కోసం జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తూ మేకోవర్ అవుతున్నాడు రవితేజ. ఇక ఖిలాడీ సినిమాలో రవితేజ సరస ఇద్దరు భామలు నటించబోతున్నారు. డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి రవితేజ సరసన ఆడిపాడబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అనసూయ కూడా నటించబోతుంది అని.. అది కూడా గ్లామర్ పాత్ర అంటున్నారు.. సో ఇన్నాళ్ళకి అనసూయ కోరిక కల నెరవేరబోతుందన్నమాట.

Tags:    

Similar News