రోజా vs అనసూయ.. ఇంట్రెస్టింగ్?

జబర్దస్త్ నుండి ఎంతమంది వెళ్లినా.. అనసూయ మాత్రం జబర్దస్త్ ని వదలడం లేదు. మరోపక్క రాజకీయాల్తో బిజీ అయినా రోజా జబర్డస్ట్ ని వీడడం లేదు. యాంకర్ [more]

;

Update: 2020-02-29 04:50 GMT
రోజా vs అనసూయ.. ఇంట్రెస్టింగ్?
  • whatsapp icon

జబర్దస్త్ నుండి ఎంతమంది వెళ్లినా.. అనసూయ మాత్రం జబర్దస్త్ ని వదలడం లేదు. మరోపక్క రాజకీయాల్తో బిజీ అయినా రోజా జబర్డస్ట్ ని వీడడం లేదు. యాంకర్ గా అనసూయ, జేడ్జ్ గా రోజాలు తమ చైర్స్ ని ఇప్పట్లో వదలరు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద అనసూయ ని రోజా ఎన్ని పంచ్ లు వేసిన సరదాగా తీసుకునే అనసూయ కి రోజాకి మధ్య గొడవేమిటో అనుకుంటున్నారా.. ప్రస్తుతం జబర్డస్ట్ తో పాటుగా అనేక ఛానల్స్ లో అనసూయ దున్నేస్తుంది. స్టేజ్ ఏదైనా పెరఫార్మెన్సు, గ్లామర్ ఒకటే అన్నట్టుగా అనసూయ చెలరేగిపోతూ… జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ లో ఇరగదీస్తోంది. మరోపక్క జెమిని టివి కోసం ఇంకో ప్రత్యేకమైన షో కోసం రేడి అవుతుంది.

మరోపక్క రోజమ్మ జబర్దస్త్ తో పాటుగా జీ ఛానల్ లో బతుకు జట్కా బండి తో పాటుగా జెమిని టివి లో మరో ప్రోగ్రాం చేయబోతుంది. అనసూయ హాట్ హాట్ గా తల్లా పెళ్ళామా అనే షో ని చెయ్యబోతుంటే.. రోజా కూడా జెమిని టివిలో అనసూయ కి పోటీ అన్నట్టుగా అమ్మ సరిలేరు నీకెవ్వరు అనే కొత్త ప్రోగ్రాం చేయబోతుంది. అమ్మల గొప్పతనం.. పిల్లలతో అమ్మలు చేసే అల్లరి ఈ షోలో హైలైట్ చేయబోతున్నారు. మెయిన్ గా ఈ షోలో మోడ్రన్ అమ్మలు కనిపిస్తారు. అనసూయ షో లో ఒక అబ్బాయి తల్లి, పెళ్ళాం మధ్యలో ఎలా నలిగిపోతున్నాడు. అలాగే తల్లి, భార్య మధ్యలో జరిగే గొడవలు, ఫన్నీ ఇన్సిడెంట్స్ ని అనసూయ తన షోలో చూపించబోతుంది. మరి అనసూయ, రోజా ల ప్రోగ్రామ్స్ జెమినీలోనే ప్రసారమవుతున్నాయి కాబట్టి.. అనసూయ vs రోజా.. ఇలా ఎవరి ప్రోగ్రాం కి ఎక్కువ టీఆర్పీ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News